TS News: ఒమిక్రాన్‌ ముప్పు ఎప్పుడైనా రావొచ్చు: శ్రీనివాసరావు

కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ ముప్పు ఎప్పుడైనా వచ్చే అవకాశం ఉందని తెలంగాణ

Updated : 02 Dec 2021 14:23 IST

హైదరాబాద్‌: కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ ముప్పు ఎప్పుడైనా వచ్చే అవకాశం ఉందని తెలంగాణ ప్రజారోగ్య సంచాలకులు డా. శ్రీనివాసరావు తెలిపారు. ఒమిక్రాన్‌ నివారణకు మన వంతు ప్రయత్నం చేయాలన్నారు. కొత్త వేరియంట్ కట్టడిపై సీఎం అధ్యక్షతన సుదీర్ఘంగా చర్చించినట్లు ఆయన వివరించారు. ప్రజలు కొవిడ్‌ నిబంధనలు తప్పక పాటించాలని కోరారు.

ఇప్పటి వరకు కరోనా వ్యాక్సిన్‌ తీసుకోనివారు.. రెండో డోస్‌ టీకా తీసుకోవాల్సిన వారు కచ్చితంగా వ్యాక్సినేషన్‌కు వెళ్లాలని శ్రీనివాసరావు విజ్ఞప్తి చేశారు. కొత్త వేరియంట్‌ ప్రవర్తన మనం పాటించే కొవిడ్‌ నిబంధనల మీద ఆధారపడి ఉంటుందని చెప్పారు. తగిన జాగ్రత్తలు పాటించకపోతే ఇప్పుడు సోషల్‌ మీడియాలో వస్తున్న అసత్య ప్రచారాలు (జనవరి లేక ఫిబ్రవరిలో మరో ముప్పు రావొచ్చని) వాస్తవమవుతాయని శ్రీనివాసరావు తెలిపారు.

డెల్టా కంటే ఆరు రెట్లు వేగంగా ఒమిక్రాన్‌..

‘‘ఒమిక్రాన్‌ ఎప్పుడైనా దేశంలోకి రావొచ్చు. నిన్న విదేశాల నుంచి వచ్చిన వారికి చేసిన పరీక్షల్లో ఒకరికి పాజిటివ్‌ వచ్చింది. బాధితుడిని టిమ్స్‌లో చేర్చి చికిత్స అందిస్తున్నాం. అతడి నమూనాలను జీనోమ్‌కు పంపాం. ఫలితాలు వచ్చాక ఒమిక్రానా కాదా అనేది తెలుస్తుంది. ఒమిక్రాన్‌ నివారణకు జాగ్రత్తలు తీసుకోవడమే మార్గం. డెల్టా కంటే ఒమిక్రాన్‌ ఆరు రెట్లు వేగంగా విస్తరిస్తోంది. మూడ్రోజుల్లోనే 3 దేశాల నుంచి 24 దేశాలకు వ్యాప్తి చెందింది’’ అని శ్రీనివాసరావు వెల్లడించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని