Ts Eamcet: ఈ నెల 25న టీఎస్‌ ఎంసెట్‌ ఇంజినీరింగ్‌ ఫలితాలు

తెలంగాణ ఎంసెట్ ఇంజినీరింగ్ విభాగం ఫలితాలను ఈనెల 25న ప్రకటించనున్నారు. ఈనెల 4, 5, 6 తేదీల్లో ఇంజినీరింగ్ ఎంసెట్ జరిగింది. వ్యవసాయ, ఫార్మా ఎంసెట్ ఫలితాలను...

Updated : 10 Aug 2021 18:58 IST

హైదరాబాద్: తెలంగాణ ఎంసెట్ ఇంజినీరింగ్ విభాగం ఫలితాలను ఈనెల 25న ప్రకటించనున్నారు. ఈనెల 4, 5, 6 తేదీల్లో ఇంజినీరింగ్ ఎంసెట్ జరిగింది. వ్యవసాయ, ఫార్మా ఎంసెట్ ఫలితాలను తర్వాత వెల్లడించనున్నారు. 25న ఫలితాలు వెల్లడించాలని నిర్ణయించిన నేపథ్యంలో ఎంసెట్‌ ఇంజినీరింగ్‌ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ ఖరారు చేశారు. ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ పాపిరెడ్డి అధ్యక్షతన సాంకేతిక విద్యా శాఖ కమిషనర్ నవీన్ మిత్తల్, ప్రవేశాల కమిటీ సభ్యులు సమావేశమై షెడ్యూలు ఖరారు చేశారు.

ఇంజినీరింగ్ ప్రవేశాల కోసం నిర్వహించే మొదటి విడత కౌన్సెలింగ్ ప్రక్రియ ఈనెల 30న ప్రారంభం కానుంది. ఈ నెల 30 నుంచి సెప్టెంబరు 9వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో రుసుము చెల్లించి ధ్రువపత్రాల పరిశీలనకు స్లాట్ బుక్‌ చేసుకోవాలి. సెప్టెంబరు 4 నుంచి 11 వరకు అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన ప్రక్రియ ఉంటుంది. సెప్టెంబరు 4 నుంచి 13 వరకు వెబ్ ఆప్షన్లకు అవకాశం కల్పిస్తారు. సెప్టెంబరు 15న ఇంజినీరింగ్ మొదటి విడత సీట్లను కేటాయిస్తారు. సెప్టెంబరు 15 నుంచి 20 వరకు విద్యార్థులు ఆన్‌లైన్‌లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. రెండో విడత కౌన్సెలింగ్ తేదీలను త్వరలోనే వెల్లడిస్తామని నవీన్ మిత్తల్ తెలిపారు.
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు