Ganesh Immersion: నిమజ్జనంపై గందరగోళానికి ప్రభుత్వమే కారణం: గణేష్ ఉత్సవ సమితి

హుస్సేన్‌ సాగర్‌లో గణేశ్‌ నిమజ్జనంపై నెలకొన్న గందరగోళానికి రాష్ట్ర ప్రభుత్వమే కారణమని భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి భగవంత రావు ఆరోపించారు

Published : 15 Sep 2021 16:28 IST

హైదరాబాద్: హుస్సేన్‌ సాగర్‌లో గణేశ్‌ నిమజ్జనంపై నెలకొన్న గందరగోళానికి రాష్ట్ర ప్రభుత్వమే కారణమని భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి భగవంత రావు ఆరోపించారు. నిమజ్జనంపై సుప్రీంకోర్టులో కూడా తీర్పు అనుకూలంగా రాకపోతే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందని ప్రశ్నించారు. తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఎలాంటి ఆటంకం లేకుండా గణేష్ నిమజ్జనాలు జరిగేలా చూడాలన్నారు. నిమజ్జనంతో చెరువులు కాలుష్యం బారిన పడతాయని చెప్పడం సరైంది కాదని అభిప్రాయపడ్డారు. నిమజ్జనం యథావిధిగా చేయాలని డిమాండ్ చేస్తూ ఇవాళ సాయంత్రం హైదరాబాద్ లో బైక్ ర్యాలీలు నిర్వహిస్తామన్నారు. రేపు హైదరాబాద్‌ నగర వ్యాప్తంగా 50 ప్రాంతాల్లో ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు ధర్నా కార్యక్రమాలు చేపట్టనున్నట్లు చెప్పారు. నిమజ్జనం విషయంలో గణేష్ మండపాల వద్దకు వెళ్ళి పోలీసులు, జీహెచ్ఎంసీ అధికారులు ఇబ్బంది పెట్టొద్దని కోరారు. సుప్రీంకోర్టు తీర్పు వచ్చాక రాష్ట్ర ప్రభుత్వ వైఖరికి అనుగుణంగా కార్యాచరణ ప్రకటిస్తామని.. అవసరమైతే హైదరాబాద్‌ బంద్‌కు పిలుపునిస్తామని భగవంతరావు వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని