Telangana high Court: స్థానికంగానే నిమజ్జనం చేస్తే బాగుంటుంది: హైకోర్టు

వినాయక విగ్రహాల నిమజ్జనంపై ఇవాళ హైకోర్టులో విచారణ జరిగింది. హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనాలు నిషేధించాలని న్యాయవాది వేణుమాధవ్‌ హైకోర్టులో పిటిషన్‌

Updated : 01 Sep 2021 17:33 IST

హైదరాబాద్‌: వినాయక విగ్రహాల నిమజ్జనంపై ఇవాళ హైకోర్టులో విచారణ జరిగింది. హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనాలు నిషేధించాలని న్యాయవాది వేణుమాధవ్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన ధర్మాసనం.. నిమజ్జనం వేళ ఆంక్షలు, నియంత్రణ చర్యలు సూచించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రభుత్వం, ఉత్సవ సమితి, పిటిషనర్‌ నివేదికలు సమర్పించాలని తెలిపింది. కొవిడ్‌ పరిస్థితులు, కాలుష్యాన్ని దృష్టిలో ఉంచుకోవాలని కోర్టు స్పష్టం చేసింది.
ప్రజల సెంటిమెంట్‌తో పాటు, ప్రస్తుత పరిస్థితులూ చూడాలని వివరించింది. ఎక్కడికెక్కడ స్థానికంగానే విగ్రహాలను నిమజ్జనం చేస్తే బాగుంటుందని హైకోర్టు అభిప్రాయపడింది. సామూహిక నిమజ్జనంతో హుసేన్‌సాగర్‌ దెబ్బతినకుండా చూడాలని ఆదేశించింది. అందరి సూచనలు పరిశీలించి ఈ నెల 6న ఆదేశాలు జారీ చేస్తామని ఉన్నత ధర్మాసనం తెలిపింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని