TS ICET: తెలంగాణ ఐసెట్‌ ఫలితాలు విడుదల... టాప్‌ 20 ర్యాంకర్లు వీరే!

రాష్ట్ర వ్యాప్తంగా ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ఐసెట్‌ ఫలితాలు విడుదలయ్యాయి. వరంగల్‌ కాకతీయ యూనివర్సిటీలో ఉన్నత విద్యా మండలి ఛైర్మన్‌ లింబాద్రి ఫలితాలను విడుదల చేశారు....

Updated : 23 Sep 2021 16:07 IST

హైదరాబాద్‌: రాష్ట్ర వ్యాప్తంగా ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ఐసెట్‌ ఫలితాలు విడుదలయ్యాయి. వరంగల్‌ కాకతీయ యూనివర్సిటీలో ఉన్నత విద్యా మండలి ఛైర్మన్‌ లింబాద్రి ఫలితాలను విడుదల చేశారు. ఐసెట్‌ ఫలితాల్లో 90.09 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు లింబాద్రి వెల్లడించారు. ఫలితాల్లో హైదరాబాద్‌కు చెందిన లోకేశ్‌కు మొదటి ర్యాంకు రాగా.. సాయి తనూజ రెండో ర్యాంకు సాధించారు. మొదటి పది ర్యాంకుల్లో తెలంగాణకు చెందిన విద్యార్థులు 9 మంది ఉండగా.. కృష్ణా జిల్లాకు చెందిన విద్యార్థి ఆనంద్‌పాల్‌ ఐదో ర్యాంకు సాధించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని