Ts News: అనాథల భవిష్యత్‌ బంగారుమయం చేసేలా ప్యాకేజీ: తెలంగాణ మంత్రులు

ఆనాథ పిల్లల కోసం తెలంగాణ ప్రభుత్వం మంచి కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించినట్లు పలువురు రాష్ట్ర మంత్రులు వెల్లడించారు. తల్లిదండ్రులు లేని పిల్లల కోసం సీఎం

Updated : 18 Aug 2021 22:00 IST

హైదరాబాద్‌: ఆనాథ పిల్లల కోసం తెలంగాణ ప్రభుత్వం మంచి కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించినట్లు పలువురు రాష్ట్ర మంత్రులు వెల్లడించారు. తల్లిదండ్రులు లేని పిల్లల కోసం సీఎం కేసీఆర్ ప్రకటించే ప్యాకేజీ.. భవిష్యత్‌ను బంగారుమయంగా తీర్చిదిద్దేలా ఉంటుందని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఆనాథలు, ఆనాథ ఆశ్రమాలు, కరోనా వల్ల తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లల స్థితిగతులను అధ్యయనం చేసేందుకు సీఎం కేసీఆర్ శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ అధ్యక్షతన ఏర్పాటు చేసిన కేబినెట్‌ సబ్‌ కమిటీ సభ్యులైన సత్యవతి రాథోడ్‌, సబితా ఇంద్రారెడ్డి సరూర్‌నగర్‌లోని విక్టోరియా మెమోరియల్‌ హోమ్‌ను సందర్శించారు.

విక్టోరియా మెమోరియల్‌ హోమ్‌లో ఉంటున్న 58 మంది ఆనాథ పిల్లలను మంత్రులిద్దరూ దగ్గరకు చేర్చుకొని వారి బాగోగులు అడిగి తెలుసుకున్నారు. ఎలాంటి వసతులు కల్పిస్తే బాగుంటుందో పిల్లలను అడిగారు. ఎలాంటి దిగులు చెందకుండా బాగా చదువుకోవాలని చిన్నారులకు సూచించారు. ఆనాథల కోసం దేశం గర్వించే విధంగా తెలంగాణ రాష్ట్రంలో నూతన విధానం తీసుకురానున్నట్లు మంత్రులు వివరించారు. మహిళా పాలిటెక్నిక్ కళాశాలను కూడా ఇక్కడే ఏర్పాటు చేసి చదువుకునే అవకాశం కల్పిస్తామన్నారు. మంత్రుల వెంట మహిళా శిశు సంక్షేమ శాఖ కమిషనర్ ప్రత్యేక కార్యదర్శి దివ్య దేవరాజన్ తదితర అధికారులు ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని