Updated : 05 Oct 2021 20:49 IST

TS News: రైల్వే జీఎంతో తెలంగాణ ఎంపీల భేటీ.. ఏమేం కోరారంటే..

హైదరాబాద్‌: సికింద్రాబాద్‌ రైల్‌ నిలయంలో తెలంగాణ, కర్ణాటక ఎంపీలతో దక్షిణ మధ్య రైల్వే జీఎం గజానన్‌ మాల్యా సమావేశమయ్యారు. ఈ సమావేశానికి తెలంగాణ, కర్ణాటకకు చెందిన లోక్‌సభ, రాజ్యసభ ఎంపీలు హాజరయ్యారు. రెండు రాష్ట్రాల్లో పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టుల పురోగతి, ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల పరిస్థితి, పనులు పూర్తయిన మార్గాల్లో ఎంఎంటీఎస్‌ రైళ్ల సర్వీసులు, స్టాపేజీలు, కాజీపేట కోచ్‌ ఫ్యాక్టరీ, చర్లపల్లి టర్నినల్‌ పనులు, వచ్చే ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌ ప్రతిపాదనలపై చర్చించారు. ఈ సమావేశానికి కాంగ్రెస్‌ ఎంపీలు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, భాజపా ఎంపీ ధర్మపురి అర్వింద్‌, తెరాస ఎంపీలు రంజిత్‌రెడ్డి, మాలోత్‌ కవిత తదితరులు హాజరయ్యారు. సమావేశం అనంతరం ఎంపీలు మీడియాతో మాట్లాడారు.

‘‘నా నియోజకవర్గ పరిధిలోని రైల్వే సమస్యలను త్వరగా పరిష్కరించాలని జీఎంను కోరా. ఆర్వోబీ, ఆర్‌యూబీ పనులు ఇప్పటి వరకు పూర్తికాలేదు. కొన్ని చోట్ల రోడ్లు మూసివేశారు.. వాటిని తెరిపించాలని కోరా. తాండూరు, వికారాబాద్‌ పరిధిలో రైల్వే సుందరీకరణ పనులు త్వరగా చేయాలని విజ్ఞప్తి చేయగా.. జీఎం సానుకూలంగా స్పందించారు’’ - రంజిత్‌రెడ్డి, చేవెళ్ల ఎంపీ

‘‘రైల్వే పెండింగ్‌ పనులపై గతంలో కేంద్రమంత్రులను కలిశాం. కరోనా పరిస్థితులతో పెండింగ్‌ పనులు ఆలస్యమయ్యాయని చెప్పారు. ఫుట్‌ ఓవర్ బ్రిడ్జి, ఆర్వోబీ పనులు ఆగిపోయాయి. ఆగిపోయిన రైళ్లను మళ్లీ పునరుద్ధరించాలని.. కొత్త లైన్లు ప్రకటించాలని కోరాం’’- వెంకటేశ్‌ నేత, పెద్దపల్లి ఎంపీ

‘‘మహబూబ్‌నగర్‌ పరిధిలో మన్నెకొండ కురుమూర్తి జాతరకు పెద్ద ఎత్తున భక్తులు వస్తుంటారు. ఆ ప్రాంత పరిధిలో ఉన్న స్టేషన్లలో రైళ్లు ఆపాలని కోరాం. తిరుపతి వెళ్లే రైళ్లని ఆ ప్రాంతాల్లో ఆపాలని కోరాం’’ -మన్నే శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీ మహబూబ్‌నగర్‌

రైళ్ల ఫ్రీక్వెన్సీ పెంచాలని కోరాం. ఎంఎంటీఎస్‌, చాలా పనులకు రాష్ట్ర ప్రభుత్వం వద్ద నిధులు లేకపోవడంతో ఆయా పనులు ఆగిపోయాయి. నిజామాబాద్‌ నుంచి న్యూదిల్లీ, ముంబయికి కనెక్టవిటీ చేయమని కోరాం. కరీంనగర్‌-తిరుపతి రైలును నిజామాబాద్‌ వరకు.. రాయలసీమ సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ను బోధన్‌ వరకు పొడిగించాలని చెప్పాం. రాష్ట్ర ప్రభుత్వం వద్ద నిధులు లేకపోవడంతోనే రైల్వే ప్రాజెక్టులకు భూసేకరణ చేయడం లేదు’’ - ధర్మపురి అర్వింద్‌, నిజామాబాద్‌ ఎంపీ

‘‘హైదరాబాద్‌-విజయవాడకు బుల్లెట్‌ రైలు మంజూరు చేయాలి. ఆర్థికంగా  ఈ మార్గం అనుకూలమైనది. ఇది అందుబాటులోకి వస్తే గంటన్నరలో ప్రయణం పూర్తవుతుంది. దీనికి కేంద్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇవ్వాలి. కాజీపేట రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీని వెంటనే మంజూరు చేయాలి. ఏపీ పునర్విభజన చట్టంలోనూ ఈ అంశం ఉంది’’ - ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, నల్గొండ ఎంపీ

Read latest General News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని