TS News: తెలంగాణ కొత్త ఓటర్ల జాబితా.. మొత్తం ఓటర్లు ఎందరంటే?

తెలంగాణలో కొత్త ఓటర్ల జాబితా అందుబాటులోకి వచ్చింది. కేంద్ర ఎన్నికల సంఘం ఇవాళ జాబితాను విడుదల చేసింది. గతేడాదితో పోలిస్తే రాష్ట్రంలో ఓటర్ల సంఖ్య...

Updated : 05 Jan 2022 16:32 IST

హైదరాబాద్‌: తెలంగాణలో కొత్త ఓటర్ల జాబితా అందుబాటులోకి వచ్చింది. కేంద్ర ఎన్నికల సంఘం ఇవాళ జాబితాను విడుదల చేసింది. గతేడాదితో పోలిస్తే రాష్ట్రంలో ఓటర్ల సంఖ్య లక్షా 91వేలు పెరిగింది. 2022 జనవరి ఒకటి అర్హత తేదీతో ఓటర్ల జాబితాను ఎన్నికల సంఘం ప్రకటించింది. దీని ప్రకారం రాష్ట్రంలో మొత్తం ఓటర్ల సంఖ్య 3,03,56,894. అందులో పురుషులు 1,52,56,474 కాగా, మహిళలు 1,50,98,685 మంది, ఇతరులు 1,735 మంది ఉన్నారు. 18- 19ఏళ్ల మధ్య ఓటర్లు 1,36,496 మంది ఉన్నట్లు అధికారులు తెలిపారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని