TS News: తెలంగాణ అప్పు ఎంతంటే?

తెలంగాణ ప్రభుత్వ అప్పు నవంబరు 30వ తేదీ నాటికి రూ.2,37,747 కోట్లకు

Updated : 21 Dec 2021 16:17 IST

ఈనాడు, దిల్లీ: తెలంగాణ ప్రభుత్వ అప్పు నవంబరు 30వ తేదీ నాటికి రూ.2,37,747 కోట్లకు చేరినట్లు కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రి పంకజ్‌ చౌధరి తెలిపారు. అందులో స్వదేశీ అప్పు రూ.2,34,912 కోట్లు, విదేశీ అప్పు రూ.2,835 కోట్లు అని వెల్లడించారు. ఆర్‌బీఐ, విదేశీ ఆర్థిక సంస్థలు, రీఫైనాన్సింగ్‌ సంస్థలు గత అయిదేళ్లలో తెలంగాణకు ఇచ్చిన అప్పుల గురించి కాంగ్రెస్‌ సభ్యుడు ఎ.రేవంత్‌రెడ్డి సోమవారం లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి ఈ మేరకు సమాధానమిచ్చారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని