Ts News: ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల గోల్‌మాల్‌.. తెలుగు అకాడమీ డైరెక్టర్‌పై సస్పెన్షన్‌ వేటు

తెలుగు అకాడమీలో ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల గోల్‌మాల్‌ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అకాడమీ డైరెక్టర్‌ సోమిరెడ్డిపై సస్పెన్షన్‌ వేటు వేసింది. అకాడమీ డైరెక్టర్‌ ఇంఛార్జ్‌ బాధ్యతల నుంచి సోమిరెడ్డిని..

Published : 01 Oct 2021 20:01 IST

హైదరాబాద్‌: తెలుగు అకాడమీలో ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల గోల్‌మాల్‌ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అకాడమీ డైరెక్టర్‌ సోమిరెడ్డిపై సస్పెన్షన్‌ వేటు వేసింది. అకాడమీ డైరెక్టర్‌ ఇంఛార్జ్‌ బాధ్యతల నుంచి సోమిరెడ్డిని తప్పిస్తూ విద్యా శాఖ ఆదేశాలు జారీ చేసింది. పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ దేవసేనకు అకాడమీ డైరెక్టర్‌గా విద్యాశాఖ అదనపు బాధ్యతలు అప్పగించింది.

మరోవైపు ఈ కేసు వ్యవహారంలో సీసీఎస్‌ పోలీసులు ఇప్పటివరకు నలుగురిని అరెస్ట్‌ చేశారు. సంతోష్‌నగర్‌ యూనియన్‌ బ్యాంక్‌ మేనేజర్‌ మస్తాన్‌వలీ, సిద్ది అంబర్‌బజార్‌ అగ్రసేన్‌ బ్యాంక్‌ మేనేజర్‌ పద్మావతి, ఏపీ మర్కంటైల్‌ సహకార సంఘం ఛైర్మన్‌ సత్యనారాయణ, సొసైటీ ఉద్యోగి మోయినుద్దీన్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. మరోవైపు ఈ వ్యవహారంలో తెలుగు అకాడమీ అధికారుల పాత్రపై పోలీసుల విచారణ కొనసాగుతోంది. నగదు బదిలీ చేసిన ఉద్యోగులతో పాటు పలువురు బ్యాంక్ ఉద్యోగులను కూడా పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ఈ నలుగురు నిందితులను కోర్టులో హాజరుపరిచిన అనంతరం చంచల్‌గూడ జైలుకు తరలించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు