Ap News: తిరుపతి కేంద్రంగా తెలుగు సంస్కృత అకాడమీ కార్యకలాపాలు: ఆదిమూలపు సురేశ్‌

తెలుగు సంస్కృత అకాడమీ తన బ్రాండ్ ఇమేజ్‌ నిలుపుకుందని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌ అన్నారు. తెలుగు సంస్కృత అకాడమీ ఇంటర్‌ పుస్తకాలను సురేశ్‌

Updated : 28 Sep 2021 17:57 IST

విజయవాడ: తెలుగు సంస్కృత అకాడమీ తన బ్రాండ్ ఇమేజ్‌ నిలుపుకుందని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌ అన్నారు. తెలుగు సంస్కృత అకాడమీ ఇంటర్‌ పుస్తకాలను సురేశ్‌ విడుదల చేశారు. తెలుగు, ఆంగ్లం, ఉర్దూ మాధ్యమాల్లో పాఠ్యపుస్తకాలు ముద్రించినట్లు చెప్పారు. మొత్తం 54 టైటిళ్లతో ఈ పుస్తకాలు మద్రించామన్నారు. తిరుపతి కేంద్రంగా తెలుగు సంస్కృత అకాడమీ పూర్తిస్థాయిలో కార్యకలాపాలు నిర్వహిస్తుందని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు. పోటీ పరీక్షల అభ్యర్థులకు అకాడమీ పుస్తకాలతో ఎంతో లబ్ధి చేకూరుతుందని పేర్కొన్నారు. తెలంగాణ నుంచి రూ.వందల కోట్లు, ఉద్యోగాలు రావాల్సి ఉందని పేర్కొన్నారు. నిధులు, ఉద్యోగాలపై సుప్రీంకోర్టు ఏపీకి అనుకూలంగా తీర్పు ఇచ్చిందని మంత్రి వెల్లడించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని