TS high court: నత్తనడకన ఏపీపీల నియామక ప్రక్రియ: హైకోర్టు

అసిస్టెంట్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్ల(ఏపీపీ) నియామకంపై తెలంగాణ హైకోర్టులో ఇవాళ విచారణ జరిగింది. ఏపీపీల నియామక ప్రక్రియకు 18 వారాల

Updated : 13 Sep 2021 16:51 IST

హైదరాబాద్‌: అసిస్టెంట్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్ల(ఏపీపీ) నియామకంపై తెలంగాణ హైకోర్టులో ఇవాళ విచారణ జరిగింది. ఏపీపీల నియామక ప్రక్రియకు 18 వారాల గడువు ఇవ్వాలని ప్రభుత్వం న్యాయస్థానాన్ని కోరింది. దీనిపై స్పందించిన హైకోర్టు.. మార్చిలో నోటిఫికేషన్ ఇచ్చి ఇప్పటి వరకు ఏం చేశారని ప్రశ్నించింది. నియామక ప్రక్రియ నత్తనడకన సాగుతోందని అసంతృప్తి వ్యక్తం చేసింది. ఏపీపీల కొరత వల్ల కేసుల విచారణ ముందుకు సాగట్లేదని తెలిపింది. అక్టోబర్ 31లోగా ఏపీపీ నియామక పరీక్ష ఫలితాల వెల్లడికి హైకోర్టు ఆదేశించింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు