The best teachers: తెలుగు రాష్ట్రాల్లో జాతీయ ఉత్తమ ఉపాధ్యాయులు వీరే!

జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుల జాబితాను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దేశవ్యా్ప్తంగా 44 మంది ఉపాధ్యాయులను పురస్కారాలకు కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసింది.

Updated : 18 Aug 2021 18:08 IST

హైదరాబాద్: జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుల జాబితాను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దేశవ్యా్ప్తంగా 44 మంది ఉపాధ్యాయులను పురస్కారాలకు కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు తెలుగు రాష్ట్రాల నుంచి నలుగురు ఎంపికయ్యారు. వారిలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ నుంచి ఇద్దరు చొప్పున ఉపాధ్యాయులు ఎంపికయ్యారు. తెలంగాణలోని ఆసిఫాబాద్‌ జిల్లా ఎంపీపీఎస్‌ సావర్‌ఖేడ్‌ యాక్టింగ్‌ హెచ్‌ఎం రంగయ్య, సిద్దిపేట ఇందిరానగర్‌ జడ్పీహెచ్‌ఎస్‌ హెడ్‌ మాస్టర్‌ రామస్వామి ఎంపికయ్యారు. ఆంధ్రప్రదేశ్‌ నుంచి విశాఖ లింగరాజుపాలెం హైస్కూల్‌ ఉపాధ్యాయుడు భూషణ్‌ శ్రీధర్‌, చిత్తూరు ఐరాల పాయిపల్లి హైస్కూల్‌ ఉపాధ్యాయుడు మునిరెడ్డిని అవార్డుకు ఎంపిక చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు