Ts News: నేడు హైదరాబాద్‌లో రైతు సంఘాల మహాధర్నా.. హాజరుకానున్న టికాయత్‌

దేశంలో వ్యవసాయ చట్టాల రద్దు అంశంపై పార్లమెంట్‌లో ఆమోదించాలని డిమాండ్‌ చేస్తూ రేపు హైదరాబాద్‌లో మహాధర్నా జరగనుంది. సాగు చట్టాలు

Updated : 25 Nov 2021 01:18 IST

హైదరాబాద్‌: దేశంలో వ్యవసాయ చట్టాల రద్దు అంశంపై పార్లమెంట్‌లో ఆమోదించాలని డిమాండ్‌ చేస్తూ నేడు హైదరాబాద్‌లో మహాధర్నా జరగనుంది. సాగు చట్టాలు రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ చేపట్టిన రైతు ఉద్యమానికి ఏడాది పూర్తయిన సందర్భంగా అఖిల భారత రైతు పోరాట సమన్వయ సమితి(ఏఐకేఎంఎస్‌‌), సంయుక్త కిసాన్‌ మోర్చా(ఎస్‌కేఎం) పిలుపు మేరకు ఇందిరా పార్క్‌ వద్ద ధర్నా జరగనుంది. ఈ కార్యక్రమంలో ఎస్‌కేఎం నేత రాకేష్‌ టికాయత్‌, ఏఐకేఎంఎస్‌ ప్రధాన కార్యదర్శులు అతుల్‌ కుమార్‌ అంజన్‌, హన్నన్‌ మెల్లా, ఏఐకేఎంఎస్‌ నేతలు జీఎస్‌ ఆశిష్‌ మిత్తల్‌, భూమి బచావో ఆందోళన్‌ నేత జగ్తార్‌ బాజ్వా తదితరులు పాల్గొననున్నారు. నేడు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ మహాధర్నా సాగుతుంది. అన్ని రకాల వ్యవసాయ పంటలకు కనీస మద్దతు ధరల చట్టం ప్రవేశపెట్టి అమలు చేయాలని ఈ వేదిక ద్వారా కిసాన్‌ నేతలు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేయనున్నారు. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే క్రమంలో హైదరాబాద్‌లో చేపట్టిన ఈ మహాధర్నాకు రాష్ట్రం నలుమూలల నుంచి పెద్ద ఎత్తున రైతులు, ప్రజా సంఘాల కార్యకర్తలు తరలిరావాలని ఏఐకేఎస్‌సీసీ తెలంగాణ కమిటీ నేతలు కోరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు