Brahmotsavam: ఘనంగా మలయప్పస్వామికి సింహ వాహన సేవ

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి.

Updated : 09 Oct 2021 17:22 IST

తిరుమల : తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. మూడో రోజు మలయప్పస్వామి సింహవాహనంపై విహరించారు. యోగ నృసింహుడిగా సింహ వాహనంపై స్వామి వారు భక్తులకు దర్శనమిచ్చారు. జగన్నాయకుడి అవతారాల్లో నాలుగోది నృసింహ అవతారం. దుష్టజన శిక్షణకు, శిష్టజన రక్షణకు సంకేతం ఈ సింహవాహనం. సింహవాహనంపై స్వామివారి వైభవాన్ని చూసి భక్తులు పులకించిపోయారు.

బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఇవాళ రాత్రి స్వామివారికి ముత్యపుపందిరి వాహనసేవ జరగనుంది. ఈనెల 11న రాత్రి స్వామివారికి గరుడోత్సవం నిర్వహించనున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని