Tirumala Brahmotsavam: బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ

అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీవేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలకు సప్తగిరులు ముస్తాబయ్యాయి. బ్రహ్మోత్సవాలకు బుధవారం సాయంత్రం 6నుంచి 7గంటల మధ్య

Updated : 06 Oct 2021 20:52 IST

తిరుమల: అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీవేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలకు సప్తగిరులు ముస్తాబయ్యాయి. బ్రహ్మోత్సవాలకు బుధవారం సాయంత్రం 6నుంచి 7గంటల మధ్య అంకురార్పణ జరిగింది. తితిదే ఛైర్మన్‌ వై.వి సుబ్బారెడ్డి, ఈవో జవహర్‌రెడ్డి, అదనపు ధర్మారెడ్డి, తితిదే బోర్డు సభ్యులు కార్యక్రమంలో పాల్గొన్నారు. కొవిడ్‌ నివారణ చర్యల్లో భాగంగా ఉత్సవాలను ఈ ఏడాది కూడా ఏకాంతంగా నిర్వహించాలని తితిదే నిర్ణయించిన విషయం తెలిసిందే.  భÅÅక్తులకు మాడవీధుల్లో శ్రీవారి వాహన సేవల దర్శన భాగ్యం ఉండదు. తితిదే ఎస్వీబీసీ ఛానల్‌లో ఉత్సవాలు ప్రత్యక్ష ప్రసారమవుతాయి. గురువారం ధ్వజారోహణంతో ప్రారంభమయ్యే బ్రహ్మోత్సవాలు 15వ తేదీ వరకు జరగనున్నాయి. బ్రహ్మోత్సవాల వేళ తిరుమల విద్యుత్‌ శోభతో వెలుగులీనుతోంది. ప్రధాన ప్రదేశాల్లో అలంకరణలు ఆకట్టుకున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని