
Updated : 07 Oct 2021 20:12 IST
Tirumala Brahmotsavam: శ్రీవారి ఆలయంలో వైభవంగా ధ్వజారోహణం
తిరుమల: సప్తగిరులు గోవిందనామ స్మరణతో మార్మోగుతున్నాయి. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీవేంకటేశ్వరస్వామి సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా ఆరంభమ్యాయి. గురువారం సాయంత్రం శ్రీవారి ఆలయంలో ధ్వజారోహణ కార్యక్రమం వైభవంగా జరిగింది. ధ్వజారోహణంతో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. ముక్కోటి దేవతలను ఆహ్వానిస్తూ అర్చకులు ధ్వజపటం ఎగురవేశారు. ధ్వజారోహణంలో భాగంగా వైదిక కార్యక్రమాలు నిర్వహించారు. తితిదే ఛైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి, ఈవో జవహర్‌రెడ్డి, అదనపు ఈవో ధర్మారెడ్డి, బోర్డు సభ్యులు కార్యక్రమంలో పాల్గొన్నారు. రాత్రికి పెద్దశేష వాహన సేవ జరగనుంది. బ్రహ్మోత్సవాల వేళ తిరుమల విద్యుత్ శోభతో వెలుగులీనుతోంది. ప్రధాన ప్రదేశాల్లో అలంకరణలు ఆకట్టుకున్నాయి. శ్రీవారి బ్రహ్మోత్సవాలు 15వ తేదీ వరకు జరగనున్నాయి.
ఇవీ చదవండి
Advertisement
Tags :