Tirumala Brahmotsavam: పెదశేష వాహనంపై విహరించిన మలయప్పస్వామి

తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ రోజు సాయంత్రం ధ్వజారోహణతో అంగరంగ వైభవంగా ప్రారంభమైన ఈ వేడుకల్లో

Updated : 07 Oct 2021 22:14 IST

తిరుమల: తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ రోజు సాయంత్రం ధ్వజారోహణతో అంగరంగ వైభవంగా ప్రారంభమైన ఈ వేడుకల్లో భాగంగా శ్రీవారి వాహన సేవలను ప్రారంభించారు. తొలిరోజు పెదశేష వాహనంపై శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్ప స్వామివారిని ఆలయ మండపంలో కొలువుదీర్చి వాహన సేవ నిర్వహించారు. స్వామివారి వాహనాన్ని ప్రత్యేకంగా అలంకరించారు. తితిదే ఛైర్మన్‌ వై.వి.సుబ్బారెడ్డి, ఈవో జహర్‌రెడ్డి, అదనపు ఈవో ధర్మారెడ్డి, తితిదే పాలకమండలి సభ్యులు వాహన సేవలో పాల్గొన్నారు.

కలియుగ వైకుంఠ నాథుడు తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో తొలిరోజు జరిగే పండుగే పెద శేషవాహన ఉత్సవం. ఆద్యంతం కన్నుల పండువగా సాగిన ఈ సేవలో శ్రీనివాసుడు శేషతల్పంపై అధిష్ఠించి దర్శనమిచ్చారు. స్వామి కొలువున్న కొండ శేషాద్రి. అందుకే తొలిరోజు పెద శేష వాహనంపై నుంచి భక్తులకు అభయ ప్రదానం చేస్తారు. విషోగ్రుడైన శేషుని అధిష్ఠించిన దేవదేవుడు మానవుల్లోని కల్మశాన్ని హరిస్తాడన్నది ఈ సేవలోని అంతరార్థం. తిరు ఆభరణాల అలంకృతుడై ఉభయ దేవేరులతో కలగలిసి వీనులవిందు చేసే మలయప్పను దర్శిస్తే సర్వపాపాలు తొలగిపోతాయనేది భక్తుల విశ్వాసం.


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని