Tirumala Brahmotsavam: సర్వభూపాల వాహనంపై వేంకటాచలపతి

శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో

Updated : 14 Oct 2021 11:41 IST

తిరుమల: శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఎనిమిదో రోజు ఉభయదేవేరులతో కలిసి వేంకటాచలపతి సర్వభూపాల వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఎనిమిదో రోజు ఉదయం రథోత్సవం నిర్వహించడం ఆనవాయితీ. అయితే ఈ ఏడాది కరోనా కారణంగా ఆలయం లోపలే వేడుకలు జరుగుతున్నందున రథోత్సవం స్థానంలో సర్వభూపాల వాహనాన్ని ఏర్పాటు చేశారు.  కార్యక్రమంలో పెద్ద జీయర్‌స్వామి, చినజీయ‌ర్‌స్వామి, ఏపీ శాసనసభ ఉప సభాపతి కోన రఘుపతి, తితిదే ఈవో జ‌వ‌హ‌ర్‌రెడ్డి దంప‌తులు తదితరులు పాల్గొన్నారు.

సర్వభూపాలురు అంటే అందరూ రాజులని అర్థం. ఈ సర్వభూపాలకుల్లో దిక్పాలకులూ చేరుతారు. సర్వ భూపాలురు వాహన స్థానీయులై భగవంతుని తమ భుజస్కంధాలపై మోస్తారు. భూపాలకులందరూ అధికార సంపన్నులే. అధికారం దుర్వినియోగం కాకుండా ఉండాలంటే వారు భగవత్‌ సేవా పరులు కావాలి. ఈ దివ్యమైన సందేశాన్ని సర్వభూపాల వాహన సేవ వివరిస్తుంది.

శ్రీవారి సేవలో ప్రముఖులు..

తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో ఎంపీలు గురుమూర్తి, మాగుంట శ్రీనివాసులరెడ్డి, తెలంగాణ ఎమ్మెల్సీ భూపాల్ రెడ్డి, తమిళనాడు మంత్రి అంబిల్ మహేష్ స్వామివారి సేవలో పాల్గొన్నారు. పెళ్ళి సందడి చిత్ర బృందం కూడా శ్రీనివాసుడిని దర్శిచుకుంది. తిరుమలకు చేరుకున్న ప్రముఖులకు స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేసిన తితిదే అధికారులు.. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని