TTD: తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త.. సర్వదర్శనాలు పునఃప్రారంభం

కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి సర్వదర్శనాలు పునఃప్రారంభం కానున్నాయి. రేపు ఉదయం 6 గంటల నుంచి సర్వదర్శనం టోకెన్లు జారీ చేయనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) ప్రకటించింది..

Published : 08 Sep 2021 01:16 IST

తిరుమల: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి సర్వదర్శనాలు పునఃప్రారంభం కానున్నాయి. రేపు ఉదయం 6 గంటల నుంచి సర్వదర్శనం టోకెన్లు జారీ చేయనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) ప్రకటించింది. రోజుకు 2వేల సర్వదర్శనం టోకెన్లను మాత్రమే జారీ చేయనున్నట్లు తెలిపింది. తిరుపతి శ్రీనివాసం కాంప్లెక్స్‌లోని కౌంటర్లలో టోకెన్లు జారీ చేయనున్నట్లు పేర్కొంది. ముందుగా చిత్తూరు జిల్లా భక్తులకు దర్శనానికి అవకాశం కల్పించన్నట్లు తితిదే స్పష్టం చేసింది.

కరోనా రెండో దశ ప్రారంభమైనప్పటి నుంచి తిరుమలలో సర్వదర్శన టోకెన్లను తితిదే నిలిపివేసింది. కేవలం ప్రత్యేక ప్రవేశ దర్శనం (రూ.300) ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకున్న భక్తులు, సిఫార్సు లేఖల ద్వారా వచ్చే భక్తులను పరిమిత సంఖ్యలో ఇప్పటివరకు స్వామివారి దర్శనానికి అనుమతించారు. ఈ విషయంలో పలు విమర్శలు వెల్లువెత్తడంతో కరోనా నిబంధనలు అనుసరిస్తూ చిత్తూరు జిల్లా భక్తులు మాత్రమే సర్వదర్శనం చేసుకునేందుకు వీలుగా తితిదే నిర్ణయం తీసుకుంది. గతంలో నిత్యం 8వేల సర్వదర్శన టోకెన్లను తితిదే జారీ చేసేది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని