TTD: జనవరి నెలకు శ్రీవారి వర్చువల్‌ సేవా దర్శన టికెట్లు విడుదల

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వర స్వామివారి వర్చువల్ సేవా దర్శన టికెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) విడుదల చేసింది. శ్రీవారి భక్తుల సౌకర్యార్థం జనవరి నెలకు సంబంధించి 1, 2 తేదీలు, 13 నుంచి 22 వరకు, 26వ తేదీల్లో 5,500 వర్చువల్‌ సేవా దర్శన టికెట్లను తితిదే విడుదల చేసింది....

Updated : 23 Dec 2021 18:19 IST

తిరుమల: కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వర స్వామివారి వర్చువల్ సేవా దర్శన టికెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) విడుదల చేసింది. శ్రీవారి భక్తుల సౌకర్యార్థం జనవరి నెలకు సంబంధించి 1, 2 తేదీలు, 13 నుంచి 22 వరకు, 26వ తేదీల్లో 5,500 వర్చువల్‌ సేవా దర్శన టికెట్లను తితిదే విడుదల చేసింది. శుక్రవారం ఉదయం 9 గంటలకు రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను జనవరి 1, 13 నుంచి 22వ తేదీ వరకు.. రోజుకు 20 వేలు చొప్పున; జనవరి 2 నుంచి 12, 23 నుంచి 31 వరకు.. రోజుకు 12 వేల చొప్పున ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. తిరుమలలో వసతి గదుల సమాచారాన్ని ఈ నెల 27న ఉదయం 9 గంటలకు ఆన్‌లైన్‌లో ప్రకటించనున్నట్లు తితిదే వెల్లడించింది. జనవరి 11 నుంచి 14 వరకు వసతిని తిరుమలలోనే కరెంట్‌ బుకింగ్‌ చేసుకోవచ్చని తెలిపింది. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ఆన్‌లైన్‌లో ముందుగానే దర్శన, వసతిని టికెట్లను బుక్‌ చేసుకోవాలని భక్తులు తితిదే సూచించింది.

వర్చువల్ సేవా టికెట్లు బుక్‌ చేసుకున్న భక్తులు శ్రీవారిని దర్శించుకునేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం అవకాశం కల్పిస్తుంది. ఈ మేరకు వర్చువల్‌ టికెట్లు బుక్‌ చేసుకుంటున్న సమయంలోనే స్వామివారి దర్శన సమయాన్ని వర్చువల్‌ టికెట్లలో పొందుపరుస్తోంది. ఈ మేరకు కేటాయించిన సమయానికి భక్తులు స్వామివారిని దర్శించుకోవాల్సి ఉంటుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని