Ts News: ఆధునిక వసతులతో టిష్యూ కల్చర్ ప్రయోగశాల: నిరంజన్‌రెడ్డి

రాష్ట్రంలో వ్యవసాయ అనుబంధ ఉద్యాన, అటవీ సంబంధ మొక్కలు పెద్ద ఎత్తున ఉత్పత్తి చేసి రైతులకు అందించనున్నట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలిపారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కుత్బుల్లాపూర్ మండలం జీడిమెట్లలో టిష్యూ కల్చర్ ప్రయోగశాల నిర్మాణానికి మంత్రి శంశుస్థాపన చేశారు...

Updated : 13 Oct 2021 17:55 IST

హైదరాబాద్‌: రాష్ట్రంలో వ్యవసాయ అనుబంధ ఉద్యాన, అటవీ సంబంధ మొక్కలు పెద్ద ఎత్తున ఉత్పత్తి చేసి రైతులకు అందించనున్నట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలిపారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కుత్బుల్లాపూర్ మండలం జీడిమెట్లలో టిష్యూ కల్చర్ ప్రయోగశాల నిర్మాణానికి మంత్రి శంశుస్థాపన చేశారు. తెలంగాణ రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిర్మించిన ఈ ప్రయోగశాల నిర్మాణానికి పునాదిరాయి వేశారు. ఈ కార్యక్రమంలో కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి, టీఎస్ విత్తనాభివృద్ధి సంస్థ ఛైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, ఎమ్మెల్యే వివేకానంద, కేంద్ర హోం శాఖ జాయింట్ డైరెక్టర్ విజయలక్ష్మి, టీఎస్ సీడ్స్ సంస్థ డైరెక్టర్ డా. కేశవులు తదితరులు పాల్గొన్నారు. ఆధునిక వసతులతో రూ.3.75 కోట్ల వ్యయంతో నిర్మించనున్న టిష్యూ కల్చర్ ప్రయోగశాల.. దేశవ్యాప్తంగా ప్రభుత్వ రంగంలో ఇదే మొదటిదన్నారు. ఈ ప్రయోగశాలలో పండ్లు, పూలు, సుగంధ, ఔషధ, అటవీ, అలంకరణ మొక్కలు ఉత్పత్తి చేసి తెలంగాణలోనే కాకుండా ఇతర రాష్ట్రాలకూ విక్రయించనున్నామని ప్రకటించారు. సంప్రదాయ విధానాలకు భిన్నంగా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, శాస్త్రీయ పద్ధతుల్లో మొక్కలు పెంచడం లక్ష్యమని తెలిపారు. తెలంగాణలో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న హరితహారం కార్యక్రమానికి అవసరమైన అన్ని రకాల మొక్కలు సరఫరా చేస్తామని మంత్రి నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని