Published : 30/11/2021 16:08 IST

Weather Report: మరో అల్పపీడనం... తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు పడే అవకాశం

హైదరాబాద్‌: దక్షిణ థాయిలాండ్‌ పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడినట్టు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఈ అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం మధ్యస్థ స్థాయి ట్రోపోస్పేయర్‌ వరకు వ్యాపించి ఉన్నట్టు తెలిపింది. ఈ అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశగా కదిలి డిసెంబరు 2వ తేదీ నాటికి వాయుగుండంగా మారి ఆ తదుపరి 24 గంటల్లో మరింత తీవ్రమై తుఫానుగా మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమయ్యే అవకాశం ఉందని పేర్కొంది. తరువాత వాయువ్యదిశగా కదిలి మరింత బలపడి డిసెంబరు 4వ తేదీ ఉదయానికి ఉత్తరాంధ్ర- ఒడిశా తీరానికి చేరుకునే అవకాశం ఉన్నట్టు వెల్లడించింది. దీని ప్రభావంతో తెలంగాణలో ఈరోజు, ఎల్లుండి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. తెలంగాణలో ఈరోజు కిందిస్థాయి గాలులు తూర్పు దిక్కు నుంచి వీస్తున్నట్టు వాతావరణ కేంద్రం వెల్లడించింది.

కోస్తాంధ్ర జిల్లాలకు భారీ వర్ష సూచన

దక్షిణ థాయిలాండ్‌ పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనం తుపానుగా మారి డిసెంబరు 4వ తేదీ నాటికి పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ ఉత్తర కోస్తాంధ్ర- ఒడిశా తీరాలకు దగ్గరగా వచ్చే సూచనలు ఉన్నాయని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో డిసెంబరు 2 నుంచి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాలతో పాటు తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల్లో వర్షాలు పడే అవకాశముందని వాతావరణశాఖ వెల్లడించింది. డిసెంబరు 3, 5 తేదీల్లో కోస్తాంధ్ర జిల్లాల్లోని పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. తుపాను ప్రభావంతో కోస్తాంధ్ర తీరం వెంబడి 80 నుంచి 90 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీచే అవకాశముందని తెలిపింది. కోస్తాంధ్ర జిల్లాలకు చెందిన రైతులు పంటలకు ఇబ్బందులు లేకుండా ముందుగానే జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.

Read latest General News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని