Weather Report: మరింత బలపడిన అల్పపీడనం.. ఉత్తరాంధ్రకు తుపాను గండం

బంగాళాఖాతంలో అండమాన్‌ తీరానికి సమీపంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడింది. ఈరోజు సాయంత్రానికి ఆగ్నేయ బంగాళాఖాతంలో అది వాయుగుండంగా

Updated : 02 Dec 2021 16:53 IST

అమరావతి: బంగాళాఖాతంలో అండమాన్‌ తీరానికి సమీపంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడింది. ఈరోజు సాయంత్రానికి ఆగ్నేయ బంగాళాఖాతంలో అది వాయుగుండంగా  మారే అవకాశముందని అమరావతిలోని వాతావరణ కేంద్రం తెలిపింది. క్రమంగా పశ్చిమ వాయువ్యదిశగా కదులుతూ రేపటికల్లా తుపానుగా మారే సూచనలు ఉన్నాయని వెల్లడించింది. ‘‘డిసెంబరు 4వ తేదీ నాటికి క్రమంగా ఇది పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉత్తర కోస్తాంధ్ర-ఒడిశా తీరాలకు దగ్గరగా వస్తుంది. ఆ తదుపరి పెనుతుపానుగా మారి పశ్చిమ వాయువ్యదిశగా కదులుతుంది. దీని ప్రభావంతో రేపటి నుంచి కోస్తాంధ్ర జిల్లాల్లో చాలాచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు. ప్రత్యేకించి ఉత్తర కోస్తాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, ఉభయ గోదావరి జిల్లాల్లోనూ ఒకటి రెండు చోట్ల మోస్తరు నుంచి విస్తారంగా వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి’’ అని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని