
Hyderabad: నగరంలో రేపు ట్రాఫిక్ ఆంక్షలు.. మద్యం దుకాణాలు బంద్
హైదరాబాద్: గణేష్ నిమజ్జనం దృష్ట్యా హైదరాబాద్‌లో పోలీసులు రేపు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఆదివారం ఉదయం 6 గంటల నుంచి సోమవారం ఉదయం వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని పోలీసులు స్పష్టంచేశారు. శనివారం అర్ధరాత్రి నుంచే అంతరాష్ట్ర, జిల్లాల నుంచి లారీల ప్రవేశాలపై నిషేధం విధిస్తున్నట్టు వెల్లడించారు. నిమజ్జనం దృష్ట్యా నగరంలో తిరిగే ఆర్టీసీ బస్సులను సైతం పలుచోట్ల దారి మళ్లిస్తున్నామన్నారు. విమానాశ్రయం, రైల్వే స్టేషన్లకు వెళ్లే ప్రయాణికులకు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు. గూగుల్ మ్యాప్‌లో ట్రాఫిక్ రద్దీపై ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేసేలా ఏర్పాటు చేసినట్టు తెలిపారు.
అలాగే, రేపు మద్యం దుకాణాలు మూసి ఉంచాలని పోలీసులు ఆదేశించారు. జీహెచ్‌ఎంసీలోని మూడు పోలీస్ కమిషనరేట్ల పరిధిలో మద్యం దుకాణాలు మూసివేస్తున్నట్టు చెప్పారు. వైన్స్, పబ్‌లు, బార్లు, కల్లు దుకాణాలు మూసివేస్తున్నట్లు తెలిపారు. రేపు ఉదయం 9 గంటల నుంచి ఎల్లుండి సాయంత్రం 6 గంటల వరకు ఆయా దుకాణాలు మూసివేసి ఉంటాయని స్పష్టంచేశారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.