AP News: మేఘాలకొండపై పర్యాటకుల సందడి.. మంత్రముగ్ధుల్ని చేస్తోన్న అందాలు

విశాఖ జిల్లాలోని వంజంగి మేఘాలకొండకు పర్యాటకులు పోటెత్తారు. వాతావరణంలో మార్పుల కారణంగా మన్యంలో

Updated : 24 Oct 2021 10:11 IST

విశాఖ: విశాఖ జిల్లాలోని వంజంగి మేఘాలకొండకు పర్యాటకులు పోటెత్తారు. వాతావరణంలో మార్పుల కారణంగా మన్యంలో మంచు వర్షం కురుస్తున్న నేపథ్యంలో సుదూర ప్రాంతాల నుంచి తరలివస్తూ ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదిస్తున్నారు. దారి పొడవునా ప్రయాణంలో మునుపెన్నడూ లేని అనుభూతిని పొందుతూ ద్విచక్ర వాహనాలు, కార్లలో మేఘాలకొండకు చేరుకుంటున్నారు. పర్యాటకులు ఊహినట్లుగానే మంచు సోయగాలు వారిని మంత్రముగ్ధుల్ని చేస్తున్నాయి. కొండల మధ్య తేలియాడే మేఘాల సమూహాలు పాలసముద్రాన్ని తలపిస్తున్నాయి. ఆ దృశ్యాలను చూస్తూ యువతీ యువకులు చిన్న పిల్లల్లా మారిపోతున్నారు. సెల్ఫీలు తీసుకుంటూ.. ఫొటోలు దిగుతూ మైమరచిపోతున్నారు. ఆదివారం ఉదయం వంజంగి మేఘాలకొండపై సూర్యోదయ సన్నివేశం చూపరులకు మరింత అద్భుతాన్ని అందించి.. ఆహా అనిపించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని