
Ts News: ముడిమ్యాల టు చేవెళ్ల.. ధరల పెరుగుదలకు నిరసనగా రేవంత్‌రెడ్డి పాదయాత్ర
హైదరాబాద్: చమురు, నిత్యావసర ధరల పెరుగుదలను నిరసిస్తూ రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం ముడిమ్యాల నుంచి పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పాతయాత్ర ప్రారంభించారు. ముడిమ్యాల నుంచి చేవెళ్లకు రేవంత్‌రెడ్డి పాదయాత్ర సాగనుంది. ముడిమ్యాలోని అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించి పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. రేవంత్‌తో పాటు దిగ్విజయ్ సింగ్ పాదయాత్రలో పాల్గొన్నారు. పాదయాత్రకు ముందు రేవంత్‌రెడ్డి చిలూకూరు బాలాజీ ఆలయాన్ని దర్శించుకున్నారు. పాదయాత్ర ముగిసిన వెంటనే చేవెళ్లలోని ఇందిరాగాంధీ విగ్రహం వద్ద నిర్వహించనున్న బహిరంగ సభలో రేవంత్ ప్రసంగించనున్నారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.