
Updated : 26 Sep 2021 16:12 IST
Cyclone Gulab: ‘గులాబ్’ ఎఫెక్ట్.. పలు రైళ్లు రద్దు
సికింద్రాబాద్: బంగాళాఖాతంలో ‘గులాబ్’ తుపాను దృష్ట్యా పలు రైళ్లను దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది. ఒడిశా నుంచి రాకపోకలు సాగించే రైళ్లను నేడు, రేపు రద్దు చేసినట్లు ప్రకటించింది. దీంతో పాటు కొన్నింటిని పాక్షికంగా రద్దు చేశామని.. మరికొన్నింటిని దారి మళ్లించినట్లు తెలిపింది. వీటిలో భువనేశ్వర్-సికింద్రాబాద్, భువనేశ్వర్-తిరుపతి, పూరి-చెన్నై సెంట్రల్, సంబల్‌పూర్-హెచ్‌ఎస్ నాందేడ్, రాయగడ- గుంటూరు, భువనేశ్వర్-కేఎస్‌ఆర్ బెంగళూరు సిటీ, భువనేశ్వర్- యశ్వంత్‌పూర్ ఎక్స్‌ప్రెస్‌లతో పాటు మరికొన్ని రైళ్లను కూడా రద్దు చేసినట్లు వెల్లడించింది. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే ట్వీట్ చేసింది.
Advertisement
Tags :