ts news: వెలిగొండ ప్రాజెక్టు పనులు ఆపించండి: కేఆర్‌ఎంబీకి తెలంగాణ లేఖ

తాగునీటికి వినియోగించే జలాలు 20శాతం మాత్రమే లెక్కించాలని కోరుతూ తెలంగాణ ఈఎన్‌సీ.. కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ) ఛైర్మన్‌కు లేఖ రాశారు. బచావత్‌

Updated : 24 Aug 2021 04:28 IST

హైదరాబాద్‌: తాగునీటికి వినియోగించే జలాలు 20శాతం మాత్రమే లెక్కించాలని కోరుతూ తెలంగాణ ఈఎన్‌సీ.. కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ) ఛైర్మన్‌కు లేఖ రాశారు. బచావత్‌ ట్రైబ్యునల్‌ ప్రకారం 20శాతం గానే లెక్కించాలని లేఖలో పేర్కొన్నారు. ఏపీ ప్రభుత్వం నిర్మిస్తున్న వెలిగొండ ప్రాజెక్టు పనులు నిలిపివేయించాలని కోరారు. వెలిగొండ ప్రాజెక్టును ఏపీ అక్రమంగా నిర్మిస్తోందని లేఖలో వివరించారు.

కృష్ణా నదీ జలాల్లో వాటాలతోపాటు కేంద్రం జారీ చేసిన బోర్డు పరిధికి సంబంధించిన గెజిట్‌ తదితర అంశాలపై చర్చించే నిమిత్తం కేఆర్‌ఎంబీ ఈ నెల 27న హైదరాబాద్‌లోని బోర్డు ప్రధాన కార్యాలయంలో సమావేశం కానుంది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన సభ్యులు హాజరుకావాలంటూ బోర్డు సభ్య కార్యదర్శి డీఎం రాయ్‌పురే ఇప్పటికే లేఖలు రాశారు. వాటితోపాటు రెండు రాష్ట్రాల పరస్పర ఫిర్యాదులు, డిమాండ్లు, నిర్వహణ నిధులు..తదితర 12 కీలక అంశాలతో రూపొందించిన ఎజెండా పత్రాన్ని కూడా లేఖలకు జతచేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని