TS News: భూముల విక్రయానికి మరోమారు ప్రభుత్వం సిద్ధం.. ఎల్లుండే నోటిఫికేషన్‌

తెలంగాణ ప్రభుత్వం భూముల వేలానికి మరో దఫా సిద్ధమైంది. ఇందులో భాగంగా ఖానామెట్‌లో 22.79 ఎకరాలు, పుప్పాలగూడలో 94.56 ఎకరాలు, ఖానామెట్‌లో 9 ప్లాట్లు..

Updated : 28 Aug 2021 15:02 IST

హైదరాబాద్‌: తెలంగాణ ప్రభుత్వం భూముల వేలానికి మరో దఫా సిద్ధమైంది. ఇందులో భాగంగా ఖానామెట్‌లో 22.79 ఎకరాలు, పుప్పాలగూడలో 94.56 ఎకరాలు, ఖానామెట్‌లో 9 ప్లాట్లు, పుప్పాలగూడలో 26 పాట్లు విక్రయించనుంది. మొత్తం 117.35 ఎకరాల విక్రయానికి సోమవారం టీఎస్‌ఐఐసీ నోటిఫికేషన్‌ విడుదల చేయనుంది. ఇందులో భాగంగా సెప్టెంబర్‌ 27న ఖానామెట్‌, అదే నెల 29న పుప్పాలగూడ భూముల ఈ-వేలం నిర్వహించనున్నారు. తొలి దఫా నిర్వహించిన భూముల విక్రయంలో ఖానామెట్‌లో ఎకరం భూమి రూ.55 కోట్లు పలికిన విషయం తెలిసిందే. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని