TS News: జగన్‌ అక్రమాస్తుల కేసు.. హెటిరోకు హైకోర్టులో చుక్కెదురు

జగన్‌ అక్రమాస్తుల కేసులో హెటిరో డైరెక్టర్‌ ఎం.శ్రీనివాస్‌రెడ్డికి హైకోర్టులో చుక్కెదురైంది. శ్రీనివాస్‌రెడ్డితో పాటు హెటిరో గ్రూప్‌ను జగన్‌ అక్రమాస్తుల కేసు నుంచి తొలగించేందుకు ..

Published : 30 Nov 2021 18:26 IST

హైదరాబాద్‌: జగన్‌ అక్రమాస్తుల కేసులో హెటిరో డైరెక్టర్‌ ఎం.శ్రీనివాస్‌రెడ్డికి హైకోర్టులో చుక్కెదురైంది. శ్రీనివాస్‌రెడ్డితో పాటు హెటిరో గ్రూప్‌ను జగన్‌ అక్రమాస్తుల కేసు నుంచి తొలగించేందుకు ఉన్నత న్యాయస్థానం నిరాకరించింది. అరబిందో, హెటిరో సంస్థలకు జడ్చర్ల సెజ్‌లో భూమి కేటాయింపుపై దాఖలు చేసిన ఛార్జ్‌షీట్‌లో శ్రీనివాస్‌రెడ్డి, హెటిరో సంస్థను నిందితుల జాబితాలో సీబీఐ చేర్చింది. తమను కేసు నుంచి తొలగించాలని కోరుతూ శ్రీనివాస్‌రెడ్డి, హెటిరో దాఖలు చేసిన క్వాష్‌ పిటిషన్లు చాలా కాలంగా హైకోర్టులో పెండింగ్‌లో ఉన్నాయి. జగన్‌ కేసులకు సంబంధించిన పిటిషన్లపై రోజువారీ విచారణ ప్రారంభించిన హైకోర్టు..  మొదట శ్రీనివాస్‌రెడ్డి, హెటిరో క్వాష్‌ పిటిషన్లపై వాదనలు విని ఇవాళ తీర్పు వెల్లడించింది. సీబీఐ అభియోగాల్లో నిజం లేదని, జగన్‌ సంస్థల్లో పెట్టుబడులు వ్యాపార వ్యూహాల్లో భాగమేనని, భూ కేటాయింపుల్లో అక్రమాలేవీ జరగలేదని హెటిరో వాదించింది. జగన్‌ ప్రమేయంతో అప్పటి వైఎస్‌ సర్కారు హెటిరో సంస్థకు తక్కువ ధరకు భూమిని కేటాయించిందని సీబీఐ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. ఇరు వైపులా వాదనలు విన్న హైకోర్టు క్వాష్‌ పిటిషన్లను కొట్టి వేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని