
Published : 05 Jan 2022 02:02 IST
Ts News: బయటకు రావడానికే జనం భయపడుతుంటే.. ఎగ్జిబిషన్ కావాలా?: హైకోర్టు
హైదరాబాద్: నాంపల్లి ఎగ్జిబిషన్లో 2019లో జరిగిన అగ్ని ప్రమాదంపై మంగళవారం హైకోర్టులో విచారణ జరిగింది. ఎగ్జిబిషన్‌ను నిలిపివేయడం సమంజసం కాదని ఎగ్జిబిషన్ సొసైటీ కోర్టుకు తెలిపింది. సినిమా థియేటర్లు, మాల్స్‌కు లేని ఆంక్షలు.. ఎగ్జిబిషన్‌కు ఎలా విధిస్తారని న్యాయస్థానం దృష్టికి తెచ్చింది. ఈ సందర్భంగా ఉన్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. బయటకు రావడానికే జనం భయపడుతుంటే.. ఎగ్జిబిషన్ కావాలా? అని ప్రశ్నించింది. ‘ఎగ్జిబిషన్ నిర్వహణపై సర్కారు నిర్ణయం తీసుకోగలదు. కొవిడ్ పరిస్థితుల్లో ఎగ్జిబిషన్ ఉంచాలా? లేదా? అనేది ప్రభుత్వ నిర్ణయం’ అని హైకోర్టు స్పష్టం చేసింది. ఫైర్, జీహెచ్ఎంసీ అనుమతి తీసుకోవాలని జీఓ ఇచ్చామని ఈ సందర్భంగా ప్రభుత్వం తరఫు న్యాయవాది ధర్మాసనం దృష్టికి తెచ్చారు. ప్రభుత్వ వివరణతో 2019 అగ్నిప్రమాదంపై విచారణను హైకోర్టు ముగించింది.
Tags :