జీహెచ్‌ఎంసీ తీరు సిగ్గుచేటు: హైకోర్టు

గంగాధర్‌ తిలక్‌ దంపతులు రోడ్లపై గుంతలు పూడుస్తున్న అంశంపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. పింఛను డబ్బుతో తిలక్‌ దంపతులు గుంతలు పూడుస్తున్నారన్న

Updated : 14 Jul 2021 17:12 IST

హైదరాబాద్‌: గంగాధర్‌ తిలక్‌ దంపతులు రోడ్లపై గుంతలు పూడుస్తున్న అంశంపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. పింఛను డబ్బుతో తిలక్‌ దంపతులు గుంతలు పూడుస్తున్నారన్న ఓ పత్రికలో కథనంపై హైకోర్టు విచారణ చేపట్టింది. వృద్ధ దంపతులు రోడ్ల మరమ్మతులు చేస్తుంటే జీహెచ్‌ఎంసీ అధికారులు ఏం చేస్తున్నారని హైకోర్టు ప్రశ్నించింది. రోడ్ల దుస్థితి చూడలేక వృద్ధ దంపతులు నడుం బిగించడం జీహెచ్‌ఎంసీకి సిగ్గుచేటని హైకోర్టు వ్యాఖ్యానించింది. జీహెచ్‌ఎంసీ అధికారుల వేతనాలను తిలక్‌ దంపతులకు ఇవ్వడం మేలని అభిప్రాయపడింది.

 ప్రమాదాల్లో ప్రాణాలు పోతుంటే.. వాహనాలు దెబ్బతింటుంటే చూస్తూ కూర్చున్నారా? పనిచేయనప్పుడు జీహెచ్‌ఎంసీకి బడ్జెట్‌ తగ్గించడం మంచిదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. నగరంలో అద్భుతమైన రోడ్లు నిర్మిస్తున్నామని జీహెచ్‌ఎంసీ తరఫు న్యాయవాది కోర్టు దృష్టకి తీసుకురాగా.. రోడ్లపై గుంతలే లేవా? న్యాయవాదులతో తనిఖీలు చేయించమంటారా? అని హైకోర్టు ప్రశ్నించింది. వర్షా కాలంలో దెబ్బతినే రోడ్ల మరమ్మతుల కోసం ప్రణాళికలేంటని జీహెచ్‌ఎంసీని ప్రశ్నించిన హైకోర్టు... జోన్ల వారీగా జోనల్‌  కమిషనర్లు, ఎస్‌ఈలు నివేదికలు సమర్పించాలని ఆదేశించింది. తదుపరి విచారణ వారం రోజులకు వాయిదా పడింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని