TS High Court: తీన్మార్‌ మల్లన్న పిటిషన్‌పై కౌంటర్‌ వేయండి: హైకోర్టు ఆదేశం

తనపై పోలీసులు పలు కేసులు నమోదు చేస్తూ వేధిస్తున్నారని తీన్మార్ మల్లన్న అలియాస్‌

Published : 10 Aug 2021 13:04 IST

హైదరాబాద్‌: తనపై పోలీసులు పలు కేసులు నమోదు చేస్తూ వేధిస్తున్నారని తీన్మార్ మల్లన్న అలియాస్‌ చింతపండు నవీన్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. దీనిపై కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రభుత్వం, పోలీసులకు ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. అనంతరం తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.

దర్యాప్తు పేరుతో పోలీసులు వేధించడం రాజ్యాంగ విరుద్ధమని తీన్మార్‌ మల్లన్న తన పిటిషన్‌లో పేర్కొన్నారు. సీసీఎస్‌, చిలకలగూడ పోలీస్‌స్టేషన్‌లో తనపై కేసులు నమోదు చేశారని, స్టేషన్‌కు పిలవకుండా పోలీసులను ఆదేశించాలని కోరారు. ఆన్‌లైన్‌లో విచారణ జరిపేలా ఆదేశించాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు.. కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రభుత్వం, పోలీసులను ఆదేశించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని