Harish Rao: స్థిరాస్తి రంగంలో హైదరాబాద్‌ దేశంలోనే అగ్రస్థానం: హరీశ్‌రావు

 సీఎం కేసీఆర్‌ అద్భుత విధానాలే తెలంగాణ వృద్ధికి కారణమని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు.

Updated : 24 Dec 2021 00:46 IST

హైదరాబాద్‌: సీఎం కేసీఆర్‌ అద్భుత విధానాలే తెలంగాణ వృద్ధికి కారణమని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. హెచ్‌ఐసీసీలో జరిగిన క్రెడాయ్‌ సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా భవన నిర్మాణ రంగంలో సేవలు అందించిన బిల్డర్లకు హరీశ్‌రావు అవార్డులు అందజేశారు. యువ ఉద్యోగులకు హైదరాబాద్‌లో పనిచేయడం ఇష్టం హరీశ్‌రావు అన్నారు. ఇండీడ్‌ సంస్థ సర్వేలో ఎక్కువ మంది హైదరాబాద్‌కు మొగ్గు చూపినట్లు ఆయన తెలిపారు. ఐఏఎస్‌ అధికారులు సైతం రిటైర్‌మెంట్‌ అయ్యాక హైదరాబాద్‌లో ఉండేందుకే ఆసక్తి చూపిస్తున్నట్లు తెలిపారు. హైదరాబాద్‌ స్థిరాస్తి రంగం దేశంలోనే అగ్రస్థానంలో ఉన్నట్లు హరీశ్‌రావు పేర్కొన్నారు. గతంలో పాలకుల నిర్లక్ష్యం, పక్షపాత ధోరణి తెలంగాణకు శాపమైందన్నారు. తలసరి విద్యుత్‌ వినియోగంలో తెలంగాణ నెంబర్‌ వన్‌ అయినట్ల ఆయన పేర్కొన్నారు. ఐటీ రంగంలో తెలంగాణ అద్భుతవృద్ధి నమోదుచేస్తున్నట్లు హరీశ్‌రావు చెప్పారు. 
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని