Ts News: గుడ్‌ న్యూస్‌... మరో కొత్త పథకానికి సిద్ధమవుతున్న టీఎస్‌ఆర్టీసీ

సంక్రాంతికి ప్రయాణికులపై అదనపు ఛార్జీల భారం లేకుండా చేసిన తెలంగాణ ఆర్టీసీ, మరో వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టింది. ఆర్టీసీ ఆదాయం పెంచుకోవడంతో

Updated : 01 Jan 2022 20:09 IST

హైదరాబాద్‌: సంక్రాంతికి ప్రయాణికులపై అదనపు ఛార్జీల భారం లేకుండా చేసిన తెలంగాణ ఆర్టీసీ, మరో వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టింది. ఆర్టీసీ ఆదాయం పెంచుకోవడంతో పాటు ప్రయాణికుల ఆదరణకోసం కొత్త పథకానికి సిద్ధమవుతోంది. రాబోయే రోజుల్లో 12 ఏళ్ల లోపు చిన్నారులు ఆర్టీసీ బస్సుల్లో శాశ్వతంగా ఉచితంగా ప్రయాణించేలా చర్యలు తీసుకుంటామని టీఎస్‌ ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ తెలిపారు. ఈ నిర్ణయం అమల్లోకి వస్తే పిల్లలతో పాటు వారి తల్లిదండ్రులు కూడా ఆర్టీసీ బస్సులో ప్రయాణించేందుకు మొగ్గు చూపుతారని అభిప్రాయపడ్డారు. తద్వారా ఆర్టీసీ ఆక్యుపెన్సీ రేషియో పెరిగే అవకాశం ఉంటుందన్నారు. బస్ భవన్‌లో జరిగిన నూతన సంవత్సర వేడుకల్లో ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌తో కలిసి బాజిరెడ్డి పాల్గొన్నారు. కేక్ కట్ చేసి ఉద్యోగులు, కార్మికులకు శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ సందర్భంగా బాజిరెడ్డి మాట్లాడుతూ.. ‘‘సంస్థలో ఉన్న ఇబ్బందులను ఒక్కొక్కటిగా అధిగమిస్తూ ముందుకెళ్తున్నాం. పదవీ విరమణ పొందిన వారికి ఇవ్వాల్సిన ప్రయోజనాలను అందించేందుకు ప్రభుత్వంతో చర్చిస్తున్నాం. వారి కుటుంబాల్లోని పిల్లల అర్హతను బట్టి ఉద్యోగాలు భర్తీ చేయాలనే ఆలోచన చేస్తున్నాం. ఇప్పటివరకు ఆర్టీసీ ఛార్జీలు పెంచనందున.. ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఛార్జీలు పెంచాలని ప్రభుత్వానికి సూచిస్తూ ప్రతిపాదనలు పంపించాం. సంస్థ ఉద్యోగులందరూ అంకితభావంతో పని చేయాలి. ప్రతి పనిలో ఆర్టీసీ సంక్షేమాన్ని చూడాలి. అందరూ సంస్థ అభివృద్ధికి పునరంకితం కావాలి’’ అని తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని