TS News: తెలంగాణలో యథావిధిగా ధాన్యం సేకరణ : కేంద్రం

తెలంగాణలో ధాన్యం సేకరణపై కేంద్రం వివరణ ఇచ్చింది. రాష్ట్రంలో యథావిధిగా ధాన్యం సేకరణ చేపడతామని వెల్లడించింది.

Published : 27 Nov 2021 11:11 IST

​​​​​

దిల్లీ : తెలంగాణలో ధాన్యం సేకరణపై కేంద్రం వివరణ ఇచ్చింది. రాష్ట్రంలో యథావిధిగా ధాన్యం సేకరణ చేపడతామని వెల్లడించింది. గతంలో నిర్ణయించిన కనీస మద్దతు ధరకే ధాన్యం సేకరించనున్నట్లు తెలిపింది.

ఈ అంశంపై కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ శాఖల మంత్రి పీయూష్‌ గోయల్‌ను రాష్ట్ర వ్యవసాయ మంత్రి నిరంజన్‌రెడ్డి నేతృత్వంలోని బృందం శుక్రవారం కలిసిన విషయం తెలిసిందే. తెలంగాణలో సాగు విస్తీర్ణం భారీగా పెరిగినందున ధాన్యం కొనుగోళ్లను పెంచాలని కోరారు. దీనిపై ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్‌ లేఖ రాయడంతో పాటు స్వయంగా కలిశారని, తాము మంగళవారం కలిసినప్పుడు కూడా అన్ని వివరాలు వెల్లడించామని మంత్రుల బృందం గుర్తు చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని