Uttar Pradesh: చనిపోయాడని ఆరు గంటలపాటు ఫ్రీజర్‌లో.. తర్వాత ఏం జరిగిందంటే!

చనిపోయాడని నిర్ధరించి ఆసుపత్రి మార్చురీలో ఉంచిన ఓ వ్యక్తి గుండె మళ్లీ కొట్టుకుంది. ఆరు గంటలపాటు ఫ్రీజర్‌లో ఉన్నప్పటికీ అతడు బతికి బయటపడటం ఓ అద్భుతమని వైద్యులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు......

Published : 22 Nov 2021 02:25 IST

దిల్లీ: చనిపోయాడని నిర్ధరించి ఆసుపత్రి మార్చురీలో ఉంచిన ఓ వ్యక్తి గుండె మళ్లీ కొట్టుకుంది. ఆరు గంటలపాటు ఫ్రీజర్‌లో ఉన్నప్పటికీ అతడు బతికి బయటపడటం ఓ అద్భుతమని వైద్యులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్‌కు చెందిన శ్రికేష్‌ కుమార్‌ (45) రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడు. తీవ్రంగా గాయపడిన శ్రికేష్‌ను స్థానికులు ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే అతడు మృతిచెందినట్లు పరీక్షించిన వైద్యుడు నిర్ధరించాడు. దీంతో పోస్టుమార్టం కోసం అతడిని ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

వ్యక్తి మృతి పట్ల ఆసుపత్రివర్గాలు పోలీసులకు సమాచారం అందించాయి. అతడి కుటుంబ సభ్యులు వచ్చే వరకు శ్రికేష్‌ కుమార్‌ను ఆసుపత్రి మార్చురీలోని ఫ్రీజర్‌లో ఉంచారు. ఆరు గంటల తర్వాత పోస్టుమార్టంకు ముందు అతడి కుటుంబ సభ్యులు, పోలీసులు వచ్చి చూడగా.. అతడు శ్వాస తీసుకుంటున్నట్లు గుర్తించారు. విషయాన్ని వైద్యులకు తెలియజేయడంతో శ్రికేష్‌ను ఐసీయూకి తరలించారు. చికిత్స అందిస్తున్నామని, అతడు కోమాలో ఉన్నట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్‌ పేర్కొన్నారు. ఫ్రీజర్‌లో ఆరు గంటలు ఉన్నప్పటికీ అతడు బతికుండటం ఓ అద్భుతమని ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. బాధితుడు మృతిచెందినట్లు వైద్యులు పొరపాటుపడ్డారా? లేక మరేదైనా కారణమనా? అనే విషయంపై విచారణ జరుగుతున్నట్లు వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు