ప్రాచీన తెలుగు సాహిత్యాన్ని భావితరాలకు చేరువ చేయాలి: వెంకయ్య

ప్రాచీన తెలుగు సాహిత్యాన్ని భావితరాలకు మరింత చేరువ చేయాల్సిన అవసరముందని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తెలిపారు. వంగూరి ఫౌండేషన్‌ ఆఫ్‌ ఆమెరికా...

Published : 24 Oct 2021 22:36 IST

దిల్లీ: ప్రాచీన తెలుగు సాహిత్యాన్ని భావితరాలకు మరింత చేరువ చేయాల్సిన అవసరముందని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తెలిపారు. వంగూరి ఫౌండేషన్‌ ఆఫ్‌ ఆమెరికా 7వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు సభా విశేష సంచికను ఆయన ఆవిష్కరించారు. ఈ తరానికి అర్థమయ్యే రీతిలో తెలుగు సాహితీ పునరుజ్జీవనం సాగాలని ఉప రాష్ట్రపతి సూచించారు. ఇందుకు ప్రతి తెలుగువాడు చొరవ చూపించాలని వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. ఇదే మార్గంలో అక్షర సేద్యం నిర్వహిస్తున్న వంగూరి ఫౌండేషన్‌ ఆఫ్‌ అమెరికాను అభినందించారు. భాష, సంస్కృతులు వేర్వేరు కావని, అవి రెండూ ఒకదానితో ఒకటి పెనవేసుకు పోయాయన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని