Ap News: తిరుమల ఘాట్‌రోడ్లపై రాకపోకలకు అనుమతిచ్చిన తితిదే

గత రెండు రోజులుగా మూసివేసి ఉన్న తిరుమల ఘాట్‌ రోడ్లను తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) పునరుద్ధరించింది. రెండు ఘాట్‌ రోడ్లలోనూ భక్తులను అనుమతించాలని...

Updated : 19 Nov 2021 16:01 IST

తిరుమల: గత రెండు రోజులుగా మూసివేసి ఉన్న తిరుమల ఘాట్‌ రోడ్లను తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) పునరుద్ధరించింది. రెండు ఘాట్‌ రోడ్లలోనూ భక్తులను అనుమతించాలని నిర్ణయించింది. గత రెండు రోజులుగా తిరుమలతో కురిసిన భారీ వర్షాలకు ఘాట్‌రోడ్లపై చెట్లు కూలిపోయాయి. కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో వాటిని తొలగించేందుకు ఘాట్‌ రోడ్లను తితిదే మూసేసింది. ఘాట్‌ రోడ్లపై విరిగిపడిన చెట్లు, కొండచరియలను తొలగించిన అనంతరం రాకపోకలకు అనుమతించింది. దీనిలో భాగంగా మొదటగా ఇవాళ ఉదయం నుంచి ఘాట్‌ రోడ్‌-1 నుంచి వాహనాల రాకపోకలను పునరుద్ధరించారు. ఘాట్‌ రోడ్‌-2పై విరిగిపడిన కొండచరియలను తొలగించిన అనంతరం వాహనాలను అనుమతించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని