
Venkaiah Naidu: ఎస్పీ బాలు వినమ్రత ఎందరికో ఆదర్శం: వెంకయ్యనాయుడు
దిల్లీ: పిల్లలకు తొలుత సంస్కారం నేర్పించాలని.. పిల్లల్లో సంస్కార బీజాలు నాటేందుకు ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలు ప్రయత్నించారని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. దిల్లీలో నిర్వహించిన విశ్వగాన గంధర్వ అంతర్జాతీయ సంగీత సమ్మేళనంలో వెంకయ్యనాయుడు పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఎస్పీ బాలుపై రూపొందించిన ప్రత్యేక పాటను ఉపరాష్ట్రపతి ఆవిష్కరించారు. బాలు.. గతం, భవిష్యత్తు మధ్య వర్తమాన స్వర సారధి, సంస్కార వారధి అని కొనియాడారు. బాలు జీవితం సినీ సంగీత చరిత్రలో ఓ మైలురాయి లాంటిదని కొనియాడారు. కథానాయకుల గాత్రంలోకి పరకాయ ప్రవేశం చేసి పాటలు పాడే బాలు ప్రతిభ అపురూపమైనది. ఎందరో తెలుగు ప్రజల జీవితాల్లోనూ, ఆలయ సుప్రభాత సంగీత నివేదనల్లోనూ ఆయన స్వరం నిత్యం ధ్వనిస్తూనే ఉంటుందన్నారు. ఎస్పీ బాలు వినమ్రత ఎందరికో ఆదర్శం అని అభిప్రాయపడ్డారు. ఈతరం యువత, కళాకారులు బాలు నుంచి స్ఫూర్తి పొందాలని ఉపరాష్ట్రపతి సూచించారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.