
TS News: టెలీ మెడిసిన్‌తో గ్రామాల్లో మెరుగైన వైద్య సేవలు: వెంకయ్య
హైదరాబాద్: గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సదుపాయాలను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. హైదరాబాద్‌లో భారత సంతతి అమెరికా వైద్యుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన 15వ గ్లోబల్ హెల్త్ కేర్ సమ్మిట్‌లో ఆయన వర్చువల్‌గా పాల్గొని మాట్లాడారు. టెలీ మెడిసిన్ ద్వారా గ్రామాల్లో మరింత మెరుగైన సేవలు అందించవచ్చన్న వెంకయ్య.. ఆన్‌లైన్ కన్సల్టేషన్, ఆన్‌లైన్ మెడిసిన్ డెలివరీ సేవలు మరింత ప్రయోజనం చేకూరుస్తాయని తెలిపారు.
ఏటికేడు ఆరోగ్య రంగంలో తెలంగాణ అభివృద్ధి సాధిస్తోందని వెంకయ్య చెప్పారు. రాష్ట్రం హెల్త్ కేర్ ఇండెక్స్‌లో మూడో స్థానంలో నిలవడంపై అభినందనలు తెలిపారు. ఫార్మాస్యూటికల్స్ ఇండస్ట్రీలో భారత్ అద్భుత ఫలితాలు సాధిస్తోందన్న ఉప రాష్ట్రపతి.. ప్రభుత్వాలు ప్రజల్లో టీకా పట్ల ఉన్న భయాలను పోగొట్టాలని సూచించారు. కొవిడ్‌పై పోరులో ప్రతిఒక్కరూ బాధ్యతగా టీకా వేసుకోవాలని కోరారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.