
Ap News: అలాంటివారు ఎప్పటికీ నాయకుడు కాలేరు: వెంకయ్యనాయుడు
పెదఅవుటపల్లి: క్రమశిక్షణ, నిబద్ధత లేని వ్యక్తి ఎప్పటికీ నాయకుడు కాలేరని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. క్రమశిక్షణతో మెలగడం కష్టమని భావించి కొందరు కులం, మతం, డబ్బుతో ప్రజాప్రతినిధులుగా ఎదుగుతున్నారని చెప్పారు. కృష్ణా జిల్లా పెదఅవుటపల్లిలోని పిన్నమనేని సిద్ధార్థ వైద్య కళాశాలలో జరిగిన కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి హాజరయ్యారు. ఈ సందర్భంగా వైద్య విద్యార్థులతో వెంకయ్యనాయుడు మాట్లాడారు. ఎవరి వృత్తికి వారే నాయకుడని.. యువత నైపుణ్యాలు పెంపొందించుకోవాలని వైద్య విద్యార్థులకు సూచించారు. ప్రజా వేదికలో మాతృభాషలో మాట్లాడటం పెంపొందించుకోవాలన్నారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.