
Venkaiah Naidu: వేడుకగా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడి మనవరాలి వివాహం
హైదరాబాద్: ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు మనవరాలి వివాహ వేడుక వైభవంగా జరిగింది. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కుమారుడు హర్షవర్ధన్-రాధ దంపతుల కుమార్తె నిహారికతో హైదరాబాద్కు చెందిన రవితేజతో శంషాబాద్ విమానాశ్రయం జీఎంఆర్ ఏరినాలో కనులపండువగా వివాహం జరిగింది. ఈ వివాహ వేడుకకకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులు, హరియాణా గవర్నర్ దత్తాత్రేయ, ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి కిషన్రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి, పలువురు మంత్రులు, నాయకులు, ప్రముఖ నటులు చిరంజీవి, నాగార్జున తదితరులు హాజరై నూతన జంటను ఆశీర్వదించారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.