Visakha Steel Plant: ఏపీ భవన్‌ వద్ద విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ఉద్యోగుల ధర్నా

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ నిర్ణయాన్ని నిరసిస్తూ దిల్లీలో స్టీల్‌ప్లాంట్‌ ఉద్యోగుల నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి..

Updated : 03 Aug 2021 17:06 IST

దిల్లీ: విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ నిర్ణయాన్ని నిరసిస్తూ దిల్లీలో స్టీల్‌ప్లాంట్‌ ఉద్యోగుల నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. మంగళవారం ఏపీ భవన్‌ వద్ద వివిధ కార్మిక సంఘాల నేతృత్వంలో ఉద్యోగులు ధర్నా చేపట్టారు. స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని.. విశాఖ ఉక్కును కాపాడాలని డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు. 

ప్రైవేటీకరణకు తెదేపా వ్యతిరేకం: కేశినేని నాని

మరోవైపు ఆందోళన చేపట్టిన విశాఖ ఉక్కు ఉద్యోగులకు తెదేపా ఎంపీలు కేశినేని నాని, కింజరాపు రామ్మోహన్‌నాయుడు మద్దతు పలికారు. ఏపీ భవన్‌ వద్దకు చేరుకుని వారికి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా కేశినేని నాని మాట్లాడుతూ ఉక్కు ప్రైవేటీకరణ నిర్ణయం చాలా బాధాకరమన్నారు. ఈ నిర్ణయంతో దాదాపు 32వేల మంది ఉద్యోగులు, వారి కుటుంబాలు ఇబ్బందులు పడతాయని చెప్పారు. కార్మికులు, ప్రజల సంపద విశాఖ ఉక్కు అని.. దాన్ని ప్రైవేటీకరణ చేస్తామంటే ఊరుకునేది లేదన్నారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణకు తెదేపా పూర్తి వ్యతిరేకమని చెప్పారు. పార్లమెంట్‌లో దీనిపై పోరాటాన్ని కొనసాగిస్తామని.. ఈ విషయంలో అన్ని పార్టీలతో కలిసి తెదేపా ముందుకెళ్తుందని నాని చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని