
vizag: విశాఖలో రూ.100 కోట్ల భూవ్యవహారం: తహసీల్దార్ సస్పెన్షన్
విశాఖపట్నం: చినగదిలి తహశీల్దార్ నరసింహమూర్తిని సస్పెండ్ చేస్తూ విశాఖ జిల్లా కలెక్టర్ మల్లికార్జున ఆదేశాలిచ్చారు. విశాఖలోని కొమ్మాదిలో రూ. 100 కోట్లు విలువ చేసే భూమిని తప్పుడు పత్రాలతో రిజిస్ట్రేషన్ చేసేందుకు ప్రయత్నించినట్లు ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో అధికారులు విచారణ చేపట్టారు. భూములు కొనుగోలుకు ఎలమంచిలి ఎమ్మెల్యే కుమారుడి కంపెనీ యత్నించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలో ఎమ్మెల్యే ఫిర్యాదుతో రెవెన్యూ మంత్రి ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ విచారణకు ఆదేశించారు. వెబ్‌ల్యాండ్‌లో ఉంచడం, తొలగించడంలో తహసీల్దార్ విధివిధానాలు పాటించలేదని ఆర్డీవో విచారణలో తేలింది. దీంతో తహశీల్దార్‌ను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ చర్యలు తీసుకున్నారు. చినగదిలి ఇన్‌ఛార్జ్ తహశీల్దార్‌గా కిరణ్ కుమార్‌కు బాధ్యతలు అప్పగించారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు.