
Updated : 21 Sep 2021 12:34 IST
TS News: డబ్బులివ్వలేదని షర్మిల దీక్షాస్థలి వద్ద అడ్డాకూలీల ఆందోళన
హైదరాబాద్: మేడ్చల్ జిల్లా పీర్జాదిగూడలో అడ్డాకూలీలు ఆందోళనకు దిగారు. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల చేపట్టనున్న దీక్షకు తమను తీసుకొచ్చి డబ్బు ఇవ్వట్లేదని అడ్డాకూలీలు నిరసన తెలిపారు. తమను తీసుకొచ్చిన వారు డబ్బు ఇవ్వట్లేదని దీక్షా స్థలి వద్దే ఆందోళన చేశారు. దీక్షలో కూర్చుంటే రూ.400 ఇస్తామని చెప్పి తీసుకొచ్చారని కూలీలు చెబుతున్నారు. మరోవైపు ఇవాళ పీర్జాదిగూడలో షర్మిల చేపట్టబోయే నిరసన దీక్షకు పోలీసులు అనుమతి నిరాకరించారు.
Tags :