Updated : 12/08/2021 12:13 IST

AP News: గోదారి అల్లుడు తీసుకొచ్చిన సారె.. అదిరిపోయింది

కోరుకొండ: పది వేల కేజీల స్వీట్లు.. వంద అరటి గెలలు.. రెండు వ్యాన్లలో పండ్లు, పూలు.. వందలాది చీరలు, రవికలు.. ఏంటి ఇదంతా అనుకుంటున్నారా...? శ్రావణ మాసం ప్రారంభంలో కొత్త అల్లుడు అత్తారింటికి వచ్చిన సందర్భంగా తీసుకొచ్చిన సారె. వివరాల్లోకి వెళితే.. తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం గాదరాడకు చెందిన బత్తుల బలరామకృష్ణ, వెంకటలక్ష్మి పెద్ద కుమార్తె ప్రత్యూషదేవిని యానాంకు చెందిన తోట రాజు, నాగలక్ష్మి కుమారుడు పవన్‌కుమార్‌తో గత మేలో వివాహం చేశారు. తొలి ఆషాఢం కావడంతో అప్పట్లో ఆ మాసంలో యానాం వియ్యాలవారికి పంపిన సారె అబ్బురపరిచింది. అదే మాదిరిగా గాదరాడ వియ్యాలవారికి యానాం నుంచి బుధవారం శ్రావణం సారె వచ్చింది. గోదారోళ్ల సారె గోదారంత అన్నట్లు.. కొత్త అల్లుడు తెచ్చిన సారె ఔరా అనిపించింది.


Read latest General News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని