TS News: అధ్వాన రోడ్లు.. పొర్లుతూ యువకుడి వినూత్న నిరసన

వికారాబాద్‌ జిల్లా తాండూరు ప్రాంతంలో అధ్వాన రోడ్ల పరిస్థితిపై ఓ యువకుడు వినూత్నంగా నిరసన తెలిపాడు. దుమ్ము, ధూళి సమస్యలతో ఇబ్బందులు పడుతున్నామంటూ ...

Updated : 01 Dec 2021 13:17 IST

తాండూరు పట్టణం: వికారాబాద్‌ జిల్లా తాండూరు ప్రాంతంలో అధ్వాన రోడ్ల పరిస్థితిపై ఓ యువకుడు వినూత్నంగా నిరసన తెలిపాడు. దుమ్ము, ధూళి సమస్యలతో ఇబ్బందులు పడుతున్నామంటూ రోడ్డుపై పొర్లుకుంటూ నిరసన వ్యక్తం చేశాడు. అంతారం గ్రామానికి చెందిన అమ్రేష్‌ ఉదయం గ్రామ సమీపంలోని ఎన్టీఆర్‌ నగర్‌ కాలనీ నుంచి పాడైన రోడ్డుపై మోకాళ్లపై కొద్దిదూరం నడుచుకుంటూ.. ఆ తర్వాత రోడ్డుపై పడుకుని పొర్లుకుంటూ నిరసన వ్యక్తం చేశాడు. ఇది చూసిన స్థానికులు యువకుడికి మద్దతు తెలిపారు. ఇప్పటికైనా అధికారులు, పాలకులు రోడ్ల సమస్యను పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు అక్కడికి చేరుకొని నిరసన తెలుపుతున్న యువకుడిని అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని