
CM Jagan: వైఎస్‌ఆర్ ఘాట్ వద్ద సీఎం జగన్, షర్మిల నివాళి
ఇడుపులపాయ: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి వర్ధంతి సందర్భంగా ఆయన కుమారుడు, సీఎం వైఎస్ జగన్ ఆయనకు నివాళులు అర్పించారు. కడప జిల్లా ఇడుపులపాయలోని వైఎస్ ఘాట్ వద్ద ఆయన ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఆయనతో పాటు సతీమణి భారతి, తల్లి విజయమ్మ, సోదరి షర్మిల, పలువురు మంత్రులు, వైకాపా నేతలు వైఎస్‌ఆర్‌కు నివాళులర్పించారు.
వైఎస్ వర్ధంతి సందర్భంగా అంతకు ముందు జగన్ ట్వీట్ చేశారు. ‘‘నాన్న భౌతికంగా దూరమై 12 ఏళ్లైనా జనం మనిషిగా ఉన్నారు. నేటికీ జన హృదయాల్లో నాన్న కొలువై ఉన్నారు. చిరునవ్వులు చిందించే రూపం మదిమదిలో నిలిచే ఉంది. నా ప్రతి ఆలోచనలో నాన్న స్ఫూర్తి ముందుండి నడిపిస్తోంది’’ అని పేర్కొన్నారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.